SKLM: రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తహశీల్దార్ గణపతిరావు తెలిపారు. గురువారం నిర్వహించిన సమావేశంలో డీలర్లు గోదాముల నుంచి సరైన తూకంతో బియ్యం అందడం లేదని ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన, పూర్తి తూకంతో బియ్యం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పేద లబ్ధిదారులకు సక్రమంగా పంపిణీ చేయాలని డీలర్లకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరిస్తాం: తహశీల్దార్


