హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కైకలూరులో ఎమ్మెల్యే కామినేని పర్యటన

ELR: స్వచ్ఛ కైకలూరు కార్యక్రమంలో భాగంగా పంచాయతీ పరిధిలోని పలు వార్డులో ఇవాళ పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేలా అధికార యంత్రాంగంతో కలిసి నేరుగా ప్రజలతో మమేకంకానున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 10:30 గంటల వరకు డ్త్రెయినేజీ, తాగునీటి సరఫరా, తదితర అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించనున్నారు.