కోనసీమ: వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అంబాజీపేటకు చెందిన దొమ్మేటి అశోకుమార్ ఇంటి ఆవరణలో భారీ కొబ్బరికాయ వెలుగుచూసింది. గురువారం చెట్టుకు ఉన్న కొబ్బరికాయలను దింపి వలవగా.. ఓ కాయ అసాధారణ పరిమాణంలో కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా 300-500 గ్రాములు, పెద్ద కాయలు 800 గ్రాముల వరకు ఉంటాయి. అయితే ఈ కొబ్బరికాయ ఏకంగా 1,240 గ్రాముల బరువు తూగి అందరినీ ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
అంబాజీపేటలో ఆకట్టుకున్న 1.240 కిలోల భారీ కొబ్బరికాయ


