హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న భక్తులు

AKP: నర్సీపట్నంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వేకువ జాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.