ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో అదనపు వరకట్న వేధింపుల కేసు నమోదైనట్లు ఎస్సై రామకృష్ణ గురువారం తెలిపారు. మాగంటి వారి వీధికి చెందిన బొర్రా లక్ష్మణరావు కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం తనను తరచూ వేధిస్తున్నారని ఆయన భార్య అమృత రాణి ఫిర్యాదు చేశారు. బాధితురాలికి ఒక కుమార్తె ఉన్నట్లు ఎస్సై పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
ఆంధ్రప్రదేశ్
అదనపు కట్నం కోసం వేధింపులు.. కేసు నమోదు


