సత్యసాయి: పెనుకొండలో మొక్కజొన్నలు కొనుగోలు చేసిన వ్యాపారి మహేశ్ 9 నెలలుగా డబ్బులు చెల్లించకుండా మోసగించాడు. దుద్దేబండకు చెందిన శ్రీనివాసులుకు 96 క్వింటాళ్లకు రూ.1,95,840, రత్నమ్మకు 108.44 క్వింటాళ్లకు రూ. 2,21,210 ఇవ్వాల్సి ఉంది. అడ్వాన్స్‌గా రూ.10 వేలు ఇచ్చి పంట తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకపోవడంతో గురువారం బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదైంది.
ఆంధ్రప్రదేశ్
మొక్కజొన్న రైతులకు మోసం.. కేసు నమోదు


