హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గీత కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

WG: గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న భీమవరంలోని ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి తెలిపారు. తణుకు CITU ఆఫీసులో గురువారం డివిజన్ అధ్యక్షుడు మామిడిశెట్టి నాగభూషణం అధ్యక్షతన సమావేశం జరిగింది. కార్మికులంతా తరలివచ్చి ముట్టడిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.