హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతిధి అధ్యాపకుడి పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

NLR: దగదర్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సివిక్స్ (పౌరశాస్త్రం) సబ్జెక్టు బోధనకు అతిధి అధ్యాపకుడి పోస్ట్ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రషీద్ తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 24వ తేదీ లోపు దగదర్తి జూనియర్ కళాశాలలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.