హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వరలక్ష్మీ వ్రతం విశిష్టత

PLD: శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మహిళలు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. కోరిన వరాలను ప్రసాదించే వరలక్ష్మీదేవిని పూజిస్తే ఆయురారోగ్యాలు, అష్ట‌ఐశ్వర్యాలు, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. భర్త దీర్ఘాయువు, కుటుంబ శ్రేయస్సు కోసం వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని భక్తితో నిర్వహిస్తారు.