హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు పొదలకూరు మండల సాధారణ సమావేశం

NLR: పొదలకూరు మండల సాధారణ సమావేశాన్ని శనివారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుబ్బరాయుడు ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఆరోజు ఉదయం 10:30కు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలియజేశారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజాప్రతినిధులు అందరు హాజరు కావాలన్నారు.