హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుని వద్ద రైలు ప్రమాదం.. ఒకరు మృతి

KKD: తుని రైల్వే స్టేషన్ పరిధిలో గురువారం రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి(55) మృతి చెందినట్లు GRP SI సత్తిబాబు తెలిపారు. తుని-గుల్లిపాడు స్టేషన్‌ల మధ్య ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. మృతుడి కుడిచేతిపై 'G RANI' పేరు, ఓం పచ్చబొట్టు ఉన్నాయి. బ్లూ జీన్స్, డార్క్ బ్లూ చెక్స్ షర్ట్ ధరించాడు. ఆచూకీ తెలిస్తే ఈ నంబర్‌కు 9247585731 సమాచారం ఇవ్వాలన్నారు.