హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 29 న వాహనాల వేలం

NLR: రవాణా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీల్లో సీజ్ చేసిన 25 వాహనాలను విడిపించుకునేందుకు ఇప్పటివరకు ఎవరు రాని తరుణంలో వీటిని ఈనెల 29న వేలం వేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. వేలంలో వాహనాన్ని దక్కించుకున్న వారు సదరు మొత్తం తో పాటు 18 శాతం జీఎస్టీ, పార్కింగ్ ఫీజు అదే రోజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.