హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శ్రీ రెడ్డమ్మ ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం

అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామంలోని శ్రీ రెడ్డమ్మ దేవస్థానంలో శుక్రవారం ఉదయం 9:30 గంటలకు సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. మహిళల సౌభాగ్యం, ఐశ్వర్యం కోసం ఈ వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఛైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజుల తెలిపారు. మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.