హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పిఠాపురం AE నూకరాజు కుమార్తె మృతదేహం లభ్యం

KKD: పిఠాపురం పంచాయతీరాజ్ AE నూకరాజు కుటుంబం గోదావరిలోకి దూకిన ఘటనలో ఆయన కుమార్తె కొవ్వూరి సౌజన్య మృతదేహం గురువారం సాయంత్రం లభ్యమైంది. రావులపాలెం మందపల్లి లంక సమీపంలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నూకరాజు భార్య మీనా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈనెల 17వ తేదీన నూకరాజు మృతదేహం లభ్యమైన సంగతి తెలిసిందే.