హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో నేడు ప్రజా సమస్యలపై దర్బార్

అమలాపురం: హౌసింగ్ బోర్డు కాలనీలోని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారు. ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది. అర్జీలు సమర్పించే వారు తప్పనిసరిగా మొబైల్ నంబర్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో హాజరు కావాలని కోరారు.