కోనసీమ: స్థానిక సంస్థల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంపై YCP MLC కుడిపూడి సూర్యనారాయణ రావు గురువారం స్పందించారు. అమలాపురంలోని కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కోర్టుల్లో వీగిపోయే విధంగా ఇప్పుడు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. బీసీల రక్షణకు కాకా కాలేల్కర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోర్టు తీర్పులపై కుడిపూడి వ్యాఖ్యలు


