హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రామచంద్రపురం డిపోలో రూ. 30 లక్షలు మాయం

కోనసీమ: రామచంద్రపురం APSRTC డిపోలో రూ. 30,05,373 నగదు మాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. డిపో క్లర్క్ ఏపీకే రావుపై గురువారం డిపో మేనేజర్ మూర్తి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజిలెన్స్, అకౌంట్స్ అధికారుల తనిఖీల్లో మ్యారేజ్ స్పెషల్ బస్సులు, డబుల్ డ్యూటీల నిధుల్లో అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయింది. క్లర్క్ ఆగస్టు 18 నుంచి విధులకు గైర్హాజరయ్యారు.