హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోక్సో కేసు.. పదేళ్ల జైలు శిక్ష

ప్రకాశం: మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితునికి 10 సంవత్సరాల జైలు శిక్ష రూ.12 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్ట్ గురువారం తీర్పు ఇచ్చింది. సింగరాయకొండ(M) పాకల గ్రామానికి చెందిన ఓ యువకుడు ఓ మైనర్ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారం చేసినట్లు ఒంగోలు మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. గురువారం విచారణ అనంతరం శిక్షను ఖరారు చేశారు.