హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాఫీ బెర్రీ బోరర్ నివారణకు సమగ్ర కార్యాచరణ

ASR: జిల్లాలో కాఫీ పంటను ఆశిస్తున్న కాఫీ బెర్రీ బోరర్ తెగులును ప్రారంభ దశలోనే గుర్తించి, రైతులకు నష్టం కలగకుండా సమగ్ర నియంత్రణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ నిశాంతి గురువారం అధికారులను ఆదేశించారు. అరకు, డుంబ్రిగుడ మండలాల్లోని 35 గ్రామాల్లో సుమారు 2,500 ఎకరాల కాఫీ తోటల్లో నాలుగు రోజుల పాటు ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు 50 బృందాలను ఏర్పాటు చేశామన్నారు.