KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని మహిళ గురువారం మృతి చెందింది. బుధవారం చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన ఆమె గురువారం మృతి చెందినట్లు ఆస్పత్రి పోలీస్ ఔట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ షబ్బీర్ తెలిపారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని, మృతురాలి సంబంధీకులు ఆస్పత్రిలో సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తుతెలియని మహిళ మృతి


