హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

TPT: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 2026-27 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ (M.SC) బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం పేర్కొంది. GAT-B 2026 ప్రవేశ పరీక్ష పాసైన మహిళా అభ్యర్థులు అర్హులని తెలియజేశారు. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.