హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువ ఓటర్లకు నమోదు అవకాశం: కలెక్టర్

సత్యసాయి: జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ సూచించారు. ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులు ఆధార పత్రాలతో సంబంధిత పోలింగ్ బూత్‌ను సందర్శించి పేరు నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భరద్వాజ్ పాల్గొన్నారు.