KDP: పోరుమామిళ్ల మండలం రాజాసాహెబ్‌పేట గ్రామం దక్షిణం వైపు కంపచెట్లలో మంగతాయి జూదం ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై పి. హనుమంతు సిబ్బందితో దాడి చేసి రూ.37,100 నగదు, 52 పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జూదం ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై దాడి.. నలుగురు అరెస్ట్


