కడప జిల్లాలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. గురువారం నిర్వహించిన వాహన తనిఖీల్లో నిబంధనలు పాటించని వాహనదారులపై 317 కేసులు నమోదు చేసి, రూ.69,160 జరిమానా విధించారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్,సీట్‌బెల్ట్ ధరించాలని SP నచికేత్ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కఠిన చర్యలు తప్పని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్ ఉల్లంఘనలపై 317 కేసులు


