హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంట గ్యాస్ ఈ కేవైసీ గడువు పెంపు

VSP: వంటగ్యాస్ వినియోగదారుల ఈకేవైసీ నమోదుకు గడువును ఈ నెల 23 వరకు పొడిగించామని డీసీఎస్ఎల్వో వి.భాస్కర్‌రావు తెలిపారు. జిల్లాలో మూడు చమురు సంస్థల పరిధిలో 8,23,635 కనెక్షన్లు ఉండగా, ఇంకా 1,00,246 మంది (12.17%) ఈకేవైసీ చేయించుకోలేదన్నారు. గడువులోగా నమోదు చేసుకోవాలని సూచించారు.