హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న ఉచిత కంటి వైద్య శిబిరం

శ్రీకాకుళం పట్టణం APHB కాలనీలోని సిద్ధార్థ స్కూల్ ఆవరణలో ఈనెల 23న ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తామని రోటరీ క్లబ్ శ్రీకాకుళం అధ్యక్షుడు నేతాడ వెంకటరావు, కార్యదర్శి అన్నెపు అనంతరావు తెలిపారు. రోటరీ క్లబ్ శ్రీకాకుళం, విజయనగరం పుష్పగిరి కంటి ఆసుపత్రి సంయుక్తంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ప్రజలు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.