హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

సమయానికి భోజనం చేయడం లేదా..?

సమయానికి భోజనం చేయడం జీర్ణక్రియకు చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రి భోజనం నిద్రపోయే గంటన్నర ముందే పూర్తి చేయాలి. దీనివల్ల తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, అసిడిటీకి దారితీస్తాయి. ప్రతిరోజూ ఒకే సమయానికి భోజనం చేయడం వల్ల శరీర జీవక్రియలు స్థిరంగా ఉంటాయి. ఇది మీ బరువును నియంత్రించడంలో, శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.