హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘మెడికల్ కాలేజీ ఏజెన్సీలపై విచారణ జరపాలి’

సంగారెడ్డి మెడికల్ కళాశాలలో ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి యాదగిరి ఆరోపించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అక్రమాలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.