GDWL: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారిని గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్ దర్శించుకున్నారు. ఆలయ ఈవో పురందర్ కుమార్, అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. అనంతరం ఆలయ విశిష్టతను వివరించి, స్వామివారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేశారు.
తెలంగాణ
బీచుపల్లి క్షేత్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ సురేంద్రమోహన్


