హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్మికులకు సెలవుల జీవో అమలు చేయాలి: సీఐటీయూ

NGKL: సీఐటీయూ పోరాటం ఫలితంగానే మున్సిపల్ కార్మికులకు వారాంతపు, నెలసరి సెలవులు మంజూరయ్యాయని పొదిల రామయ్య అన్నారు. నాగర్‌కర్నూల్ మున్సిపల్ మేనేజర్‌కు సీఐటీయూ నాయకులు, కార్మికులు జీవో సర్క్యులర్‌ను అందజేశారు. వారాంతపు, నెలసరి, క్యాజువల్, ప్రసూతి సెలవులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్ బకాయిలు, పెండింగ్ ఏరియర్లను చెల్లించాలని కోరారు.