KNR: కరీంనగర్ సర్కిల్లో టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి గురువారం పర్యటించారు. అనంతరం పలు విద్యుత్ అభివృద్ధి పనులను పరిశీలించారు. హుజూరాబాద్ డివిజన్ కార్యాలయం, తెలంగాణ చౌక్ ఇండోర్ సబ్‌స్టేషన్, వాటర్ వర్క్స్ సౌర విద్యుత్ ప్లాంట్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాణ్యత, భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.
తెలంగాణ
అభివృద్ధి పనులను పరిశీలించిన సీఎండీ


