KNR: కరీంనగర్ కిసాన్‌నగర్‌కు చెందిన గన్నులక్ష్మి–మోహన్ వృద్ధ దంపతులు కుమారుల ఆదరణ లేక దీనస్థితికి చేరుకున్నారు. మంథనిలో చికిత్స అనంతరం కరీంనగర్ చేరుకోగా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికుల సమాచారంతో స్వచ్ఛంద సంస్థ వారు వెలిచాల స్పందన వృద్ధాశ్రమంలో చేర్పించారు. ఈ ఘటనపై విచారణ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు.
తెలంగాణ
కుమారుల ఆదరణ లేక వృద్ధ దంపతుల దీనస్థితి


