హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రాచలంలో రేపు వరలక్ష్మీ వ్రతం

BDK: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆగస్టు 21న వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సామూహిక సహస్రనామ కుంకుమార్చన జరగనుంది. భక్తులు రూ.200 టికెట్‌తో పూజలో పాల్గొనవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు. అలాగే, ఆగస్టు 23 నుంచి 28 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.