హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాకు చేరుకున్న ప్యాక్ట్ కాంప్లెక్స్ ఎరువులు

KMM: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు గురువారం ప్యాక్ట్ కాంప్లెక్స్ ఎరువులు చేరుకున్నాయని డీఏవో ధనసరి పుల్లయ్య చెప్పారు. ఇందులో 591.750 మెట్రిక్ టన్నుల 15:15:15, 562 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని తెలిపారు. ఈ లోడును ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాలకు కేటాయించామన్నారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎరువులు తగినంత అందుబాటులో ఉన్నాయని అన్నారు.