హైదరాబాద్: 28°C
తెలంగాణ

రూపా రెడ్డి హత్యకు స్కూళ్ల బంద్

VKB: నల్గొండ నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపాల్‌ రూపా రెడ్డి హత్యకు నిరసనగా రేపు తాండూరులో పాఠశాలల బంద్‌ పాటించాలని TRSMA తాండూరు శాఖ పిలుపునిచ్చింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని, విద్యావేత్తలకు భద్రత కల్పించాలని సంఘం అధ్యక్షుడు మోహన్‌ కృష్ణ గౌడ్‌ డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు నల్ల రిబ్బన్లు ధరించి మౌనం పాటించాలని కోరారు.