గద్వాలలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కాంప్లెక్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..విద్యార్థుల వికాసానికి ఉపాధ్యాయులు మానసిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ బోధించాలని సూచించారు. విద్యార్థుల ర్యాంకు మెరుగయ్యేలా ఉపాధ్యాయులు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాల సమావేశంలో కలెక్టర్


