హైదరాబాద్: 28°C
తెలంగాణ

'జూనియర్‌ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి’

KMR: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని జీవీఎస్‌, డీఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు జిల్లా ఇంటర్మీడియట్‌ నోడల్‌ అధికారికి గురువారం వినతిపత్రం అందజేశారు. కళాశాలలో సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని కోరారు.