హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య కళాశాలలో అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

ములుగు ప్రభుత్వ వైద్యకళాశాల, అనుబంధ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న 47 అధ్యాపక పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా. స్వర్ణకుమారి తెలిపారు. ప్రొఫెసర్–5, అసోసియేట్ ప్రొఫెసర్–17,అసిస్టెంట్ ప్రొఫెసర్–25 పోస్టులున్నాయి. ఆగస్టు 24-సెప్టెంబర్ 1 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా, సెప్టెంబర్ 10న ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.