హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

KMM: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని హనుమతండా సమీపంలో శనివారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో గ్రామానికి చెందిన బానోతు వీరు(29) తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు వీరును మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.