హైదరాబాద్: 28°C
తెలంగాణ

శివారు ప్రాంతాలపై ఎమ్మెల్యే ఫోకస్

MDCL: కొంపల్లి సర్కిల్‌లోని అపర్ణ పామ్ మెడోస్, పామ్ గ్రోస్‌లో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ పాదయాత్ర నిర్వహించారు. శివారు ప్రాంతాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రధాన రహదారితో పాటు అంతర్గత సీసీ రోడ్లు నిర్మించి కొంపల్లి డివిజన్‌ను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.