హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్యవివాహాలపై సీఐ అవగాహన

CTR: విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని మహిళా స్టేషన్‌ సీఐ మోహన్‌ సూచించారు. చిత్తూరులోని గర్ల్స్‌ గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజీలో గురువారం విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాలతో అనర్థాలు జరుగుతాయని వివరించారు. మహిళలు, చిన్నారులపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.