హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజిలెన్స్ & మానిటరింగ్ జిల్లా కమిటీ సభ్యురాలిగా కల్పన

MHBD: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీల నివారణకు ఏర్పాటుచేసిన విజిలెన్స్ & మానిటరింగ్ జిల్లా కమిటీలో తొర్రూరు పట్టణానికి చెందిన పంజా కల్పనకి సభ్యురాలిగా అవకాశం లభించింది. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన MLA యశస్విని, ఝాన్సీరెడ్డిలకు కల్పన ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా తనవంతు కృషి చేస్తానన్నారు.