హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చట్టాలపై అవగాహన అవసరం: మొగల్తూరు SI

W.G: విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉండాలని మొగల్తూరు ఎస్ఐ సీహెచ్. జయలక్ష్మి సూచించారు. గురువారం తూర్పుతాళ్ల ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె సూచించారు. ఏదైనా సమస్య ఎదురైతే భయపడకుండా ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలన్నారు.