హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు టోకరా

అన్నమయ్య: పులివెందులలో రైల్వే, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖకు చెందిన ప్రకాశ్ రావు, తిరుపతికి చెందిన మహేష్‌ను అదుపులోకి తీసుకుని రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం ఖాయమంటూ డబ్బులు అడిగే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.