హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ నిరసన ర్యాలీ

VZM: పూసపాటిరేగకు చెందిన రిపోర్టర్ గోవిందపై జరిగిన దాడిని ఖండిస్తూ రాజాం ప్రాంతీయ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్‌ నుంచి అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ర్యాలీ చేపట్టి నిరసన తెలిపారు. రిపోర్టర్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.