సత్యసాయి: ధర్మవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ సతీష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు. నేరాల రహిత, గంజాయి రహిత ధర్మవరమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని, స్కూళ్లు, కాలేజీల వద్ద బైక్ ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు అపరిచితుల మాటలు నమ్మవద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి రహిత ధర్మవరమే లక్ష్యం: ఎస్పీ


