హైదరాబాద్: 28°C
తెలంగాణ

'డబుల్ బెడ్రూం ఇళ్లపై ప్రభుత్వ నిర్లక్ష్యం'

KNR: కమలాపూర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల జాబితాను వారంలో ప్రకటిస్తామని చెప్పి పది రోజులు గడిచినా జాబితా విడుదల చేయలేదని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు కేటాయించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. వెంటనే లబ్ధిదారుల జాబితా ప్రకటించి ఇళ్లను అందించాలని MLA డిమాండ్ చేశారు.