గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు గ్రామ శివారులో డ్యామ్ రోడ్డు పక్కన మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ మరమ్మతుల కోసం తవ్వి వదిలేసిన గుంతలు ప్రమాదకరంగా మారాయి. పనులు పూర్తి చేసినా పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉన్నందున, అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
గుంతలు తవ్వారు పూడ్చాలి కదా!


