హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

PPM: పెద్ద బొండపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ షేక్ హఫీజా ఇవాళ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో అందుతున్న వైద్య సేవలు, ఈహెచ్ఆర్‌, ఈ-ఔషధ సేవల అమలు తీరును పరిశీలించారు. ల్యాబ్‌, ఆసుపత్రి రికార్డులను తనిఖీ చేసి, రక్త పరీక్షల ఫలితాలను సకాలంలో రోగులకు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.