హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఏఎన్‌యూలో ప్రొఫెసర్ల వేతనాలు పెంచాలి'

GNTR: ఏఎన్‌యూలో ఇంజనీరింగ్ అడ్మిషన్లు తగ్గడంపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటులో వేలల్లో చేరుతుంటే, ఇక్కడ 542 మందే చేరారన్నారు. ప్రైవేట్ వర్సిటీల్లో ప్రొఫెసర్లకు రూ.2 లక్షలు ఇస్తుంటే, ఇక్కడ రూ.80 వేలే ఇస్తున్నారని చెప్పారు. దీనివల్ల నాణ్యమైన ఫ్యాకల్టీ రావడం లేదన్నారు. ప్రభుత్వ వర్సిటీల్లో వేతనాలు పెంచాలని కోరారు.